Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అమ్మ మనకు జన్మనిస్తే, విద్య మనిషి జీవిత గమనాన్ని మారుస్తుందని చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎండి ఆజమ్ అలీ అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణ శివారులోని కెసి క్యాంపులో గల ఎంజెపి పాఠశాలలో విద్యార్థినీలకు విద్యపై అవగాహన సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్య ద్వారానే వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తాయనీ అన్నారు.
ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని క్రమశిక్షణతో, పట్టుదలతో, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం శ్రమిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు” అని అన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వంటి వాటికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల విలువైన సమయం వృథా అవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శారద, కళ్యాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.





