
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో గల శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో సమృద్ధిగా వానలు కురవాలని గ్రామస్థులు జల అభిషేకం చేయడం జరిగింది. ఓం నమః శివాయ, హర హర మహా దేవ, కరుణించి వర్షాలు కురిపించి పంటలు పండేలా చెయ్ స్వామి అని శివాయ్యాను వేడుకోవడం జరిగింది. ఆలయ ప్రధాన పూజారి పందిళ్ళ భాస్కర్ శర్మ, విజయ్ శర్మలు శివునికి ప్రత్యేక పూజలు చేసి స్థానికులకు ఆశీర్వచనం చేశారు.ఇందులో 14వ, 24వ వార్డుల కౌన్సిలర్లు వజ్జపలి వెంకటేశ్వర్లు, నాంపల్లి శ్రీనివాస్, గ్రామస్థులు చేలికా అఖిల్, కౌడగాని దినేష్, మహేష్, తిరుపతి, పవన్, బుచ్చన్న, మహేష్, కేశబోయిన అశోక్, సమ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.








బోర్నపల్లిలో గల శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో సమృద్ధిగా వానలు కురవాలని గ్రామస్థులు జల అభిషేకం చేస్తున్న దృశ్యాలు





