
—ముఖ్య అతిథిగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ జూలై 13: కరీంనగర్ జిల్లాలోని జ్యోతినగర్ లో ఉన్నా కెమిస్ట్ భవన్ లో కరీంనగర్ జిల్లా ఆర్ఎంపి, పీఎంపీ అసోసియేషన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులుగా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ ఆర్ఎంపీ వైద్యుడు కొక్కుల రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా నూతన డివిజన్ అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ….డివిజన్ లోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా సంఘం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందని, వారి హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకునేలా సంఘం తరఫున ప్రయత్నిస్తానని తెలిపారు. హుజూరాబాద్ డివిజన్ స్థాయిలో ఉన్నా సభ్యులందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాకు నియామకానికి సహకరించిన జిల్లా అద్యక్షులు చెన్న మాధవుని నరసింహరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపెల్లి భీమన్న, జిల్లా కోశాధికారి సంజీవరెడ్డి, గౌరవ అధ్యక్షుడు కాసం రవీందర్ రెడ్డి, జోనల్ అధ్యక్షుడు మనోహర్, జోనల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గుడిపాటి సమ్మిరెడ్డికి మరియు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.


ఆర్ఎంపి, పీఎంపీ అసోసియేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కే రవీందర్..





