
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జూలై 13: డిగ్రీ విద్యార్థులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, మొదటి సంవత్సరం నుండి విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలని సింగపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల రిజిస్ట్రారార్ డాక్టర్ వి రాజేశ్వరరావు అన్నారు. సోమవారం హుజురాబాద్ మండలం సింగాపురంలోని విఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. దీనికి ప్రిన్సిపాల్ టి అజయ్ కుమార్ అధ్యక్షత వహించగా కిట్స్ రిజిస్ట్రార్ డాక్టర్ వి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని కోరారు. ఉపాధ్యాయ అవకాశాలతో పాటు ఉన్నత విద్య అవకాశాలు కూడా పుష్కలంగా డిగ్రీ విద్యార్థులకు ఉన్నాయని తెలిపారు. హుజురాబాద్ ప్రాంత విద్యార్థులకు వ్యాపారాత్మక ధోరణితో కాకుండా సేవా భావంతో విఎస్ఆర్ డిగ్రీ కళాశాల సేవలందిస్తోందని తెలిపారు. గతంలో కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. విద్యార్థులు సమయం వృధా చేయొద్దని, కళాశాలలో ఉన్న సౌకర్యాలను వినియోగించు కోవాలని, క్రమశిక్షణతో మెదలాలని, యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటినుండి సివిల్ సర్వీసెస్ కు కూడా సన్నద్ధం కావాలని, కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు గ్రామాలకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు ఆటపాటల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


సెమినార్ లో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులు





