
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మైనర్ బాలుడు పై కేసు నమోదు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ శుక్రవారం రాత్రి తెలిపారు. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని ఓ మండలంలోని ఓకే గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు గత మూడు రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి వారు పాఠశాలకు చేరుకొని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయడంతో పాటు గొడవకు దిగి అక్కడ నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసుకొని బాలికను వైద్య పరీక్షలకు తరలించి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సిఐ తెలిపారు. ఈ విషయం ఆ నోట ఈ నోటా పాకడంతో పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది.





