
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: సినీ నటుడు మంచు మోహన్ బాబు మానసికంగా బాధతో ఉన్నారనీ, ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారనీ మోహన్ బాబు ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్యం స్థిమితంగా లేదు, ఎడమ కంటి కింద కమిలిన గాయం అయింది.. కుడి కంటి కింద వాపు ఉంది.. ఈరోజు సిటీ స్కాన్ చేయబోతున్నాం అని వైద్యులు తెలిపారు. మోహన్ బాబు హై బీపీతో బాధపడుతున్నారు.. హార్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉందన్నారు. ఆసుపత్రిలో చికిత్స చేయాల్సిన అవసరం ఉంది.. మోహన్ బాబుకు రెండు రోజుల చికిత్స అవసరం అని ఆయన పరీక్షించిన వైద్యులు తెలిపారు.






