
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మామిళ్లవాడకు చెందిన మున్సిపాలిటీ రిటైర్డ్ ఉద్యోగి బండ జంపయ్య గుండెపోటుతో మరణించాడని తెలుసుకొని టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుమారులు బండ మోహన్, వెంకటేష్ తదితర కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పారపు భువనచంద్ర, ఎర్ర శ్రీనివాస్, ఎర్ర కుమార్, రొంటాల లింగయ్య, ఇమ్మడి కుమారస్వామి, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగం బొడిగ మల్లయ్య తదితరులున్నారు.






