
స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ: ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను 2024 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘దీపిక’ అనే సాహిత్య విమర్శా సంపుటికి ఈ గౌరవం దక్కింది. తెలుగుతో సహా 21 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ పురస్కార విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 8న ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణకు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, కవులు, రచయితలు అభినందనలు తెలిపారు.
