Oplus_131072
–జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై దాడిని ఖండిస్తున్న.
–హుజురాబాద్ ప్రజల పరువు తీస్తున్నాడు.
–కౌశిక్ రెడ్డి తీరును కేటీఆర్, హరీష్ రావు సమర్ధిస్తారా?
–ఇలాంటి గుండాయిజన్ని ప్రోత్సహిస్తుంది బిఆర్ఎస్ పార్టీ కాదా?
–కేటీఆర్, హరీష్ రావు మీ ఎమ్మెల్యేని మెంటల్ హాస్పిటల్ లో చేర్పించండి.
-నియోజకవర్గ అభివృద్ధిపై నీకు సోయి లేదు.
–ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదు.
–మొగోడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. పోటి చేస్తే ఎవరి సత్తా ఎంటో తెలుస్తది.. ప్రణవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన దాడిని ఖండిస్తున్నట్లు, పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర పనులు ఏరోజు చేయలేదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెట్టే ఎమ్మెల్యే తను ఏ పార్టీ నుంచి ఫిరాయించి బిఆర్ఎస్ లో చేరాడో తెలుసుకోవాలని సూచించారు.సంవత్సరం గడుస్తున్నా కౌశిక్ రెడ్డికి అధికారం మదం ఇంకా తగ్గలేదని దమ్ముంటే హుజురాబాద్ లో రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.ఈ సవాల్ స్వీకరించి ఎమ్మెల్సీగా, విప్ గా ఉన్న సమయంలో హుజురాబాద్ అభివృద్ధికి ఏం చేశారో, గడిచిన సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేశామో ప్రజలకు వివరించి ఎన్నికలకు పోదామని తెలిపారు. ఎమ్మెల్యే పదవి పరువు తీస్తున్నాడని, చనిపోతా అంటే ఓట్లు వేసినా హుజురాబాద్ ప్రజల పరువు తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హుజురాబాద్ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత పరువు నిలబెట్టేలా వ్యవహరించారే తప్ప ఇలాంటి చిల్లర పనులు చేసి హుజురాబాద్ పరువు తీయలేదని అన్నారు. నీయోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజా సమస్యల వినిపించాల్సిన కౌశిక్ రెడ్డి అధికారులతో, నాయకులతో గొడవలు పెట్టుకుని హుజురాబాద్ కు రావాల్సిన నిధులను కూడా రాకుండా చేస్తున్నాడని ఇలాంటి చర్యలు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం సమర్ధిస్తుందా? అని ప్రశ్నించారు. హుజరాబాద్ లో గతంలో చెప్పినట్టుగా చివరి ఆయకట్టు వరకు తాము సాగునీరు అందిస్తామని దానికి కట్టుబడి ఉన్నామని ఇటీవలే కౌశిక్ రెడ్డి సొంత మండలమైన వీణవంక ప్రజలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించామని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సోషల్ మీడియాలో హైప్ ఆవ్వడానికి కౌశిక్ రెడ్డి చేస్తున్న చిల్లర ప్రయత్నాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారని, కౌశిక్ రెడ్డి కేటీఆర్, హరీష్ రావుకు డ్రైవర్ ఆ లేక హుజురాబాద్ ప్రాంత ఎమ్మెల్యే నా అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికైనా స్పందించి కౌశిక్ రెడ్డిని ఏదైనా మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని కోరారు. బేషరతుగా తక్షణమే ఎమ్మెల్యే సంజయ్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






