
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి రాజన్నను దర్శించుకున్నారు. ఆరుద్ర నక్షత్రం సోమవారమ పౌర్ణమి మహా పర్వదినాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి, ఆయు ఆరోగ్యాలతో పాడి పంటలతో, ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. రైతంగము బాగుంటేనే అందరూ బాగుంటారని, దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. ఆధి శ్రీనివాస్ తో పాటు నాది ,ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అన్నారు. నిత్యాన్నదాన సత్రంకు మంత్రి పొన్నం ఫ్యామిలీ తరపున రూ.40 లక్షల విరాళం అందించారు. ముఖ్యమంత్రికి మా విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం భవన నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారన్నారు. 35 కోట్లతో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ జరుగుతుందన్నారు. అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్ట్ లో ఇప్పటికే 20 కోట్లు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.













