Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బిజెపి సీనియర్ నాయకుడు రావుల వేణుని బీజేపీ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ గా నియమించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ..బీజేపీ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. నా మీద నమ్మకంతోనే నాకు జిల్లా కౌన్సిల్ మెంబర్ గా నియమకానికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డికి, జిల్లా, పట్టణ నాయకులకు వేణు కృతజ్ఞతలు తెలిపారు.






