Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో జనవరి 12,ఆదివారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009-2010 సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంతో ఒకే వేదికపై 15 సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర చాలా కీలక ఆటపాటలు చిలిపి చేష్టలు ఇలా ఏదైనా గాని మనం వెన్నంటే ఉండి నేనున్నానంటూ ధైర్యం చెప్పేది ఒక స్నేహం మాత్రమే అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకమని, ఆనందముగా తలుచుకుంటూ ఒకసారి వయసు మరిచిపోయి దుద్దేనపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో కోలహలం మధ్య గుర్తు చేసుకున్నారు. ఈ పాఠశాలను హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలను 40 మంది విద్యార్థులు, అడిగి తెలుసుకున్నారు. 2009-2010 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండువగా మారింది. 15 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో వెళ్ళినవారు ఎక్కడో సిరపడ్డవారు కొందరు ఉద్యోగాల్లో కొందరు సహాధర్మచరి నిలుగా కొందరు, వివిధ పరిస్థితుల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలని కృతుహలంతో ఆనాటి విద్యార్థులైన కొంతమంది విద్యార్థులకు ఆలోచన కలిగింది. ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులను నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గురువులను శాలువాలతో, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురువులు ప్రభాకర్, రాజేందర్, రాజేశ్వరరావు, ప్రభాకర్, రాజయ్య, రాజమౌళి, సారంగపాణి, అభిబోద్దిన్, మహేందర్, రఫీ, దయల్, గ్రామ పెద్దలు తాజా మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగేందర్ రెడ్డి, ఎంపీటీసీ చాడ చైతన్య కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






