
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం విద్యానగర్ కు చెందిన బోనగిరి కమలాకర్(61) సంవత్సరాలు రిటైర్డ్ RTC కండక్టర్ జమ్మికుంట దుర్గకాలనీ ప్రక్కన గల రైలు పట్టాలపై ఎగువ SOB గూడ్స్ ట్రైన్ క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి తిరుపతి తెలిపారు. హుజురాబాద్ విద్యానగర్ కు చెందిన కమలాకర్ ఏడాది క్రితమే ఆర్టీసీలో కండక్టర్ గా రిటైర్డ్ అయ్యారు. నాటినుండి కుటుంబ సమస్యలతో మద్యానికి బానిస అయి జీవితంపై విరక్తి చెంది జమ్మికుంట మడిపల్లి వద్ద రైలు పట్టాలపై ఎగువ SOB గూడ్స్ ట్రైన్ క్రింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడన్నారు. మృతునికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.







