
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్లో ఈ రోజు SASTRA PUBLIC SCHOOL లో హుజురాబాద్ పట్టణ సిఐ టి కరుణాకర్ Box cricket ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు గేమ్స్ కూడా ముఖ్యమని, ప్రతి పిల్లవాడు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. పట్టణాలకు దీటుగా, కార్పొరేట్ స్కూళకు దీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దడం అభినంద నీయమన్నారు. ఈ కార్యక్రమంలో SASTRA PUBLIC SCHOOL డైరెక్టర్లు, మరియు ప్రిన్సిపల్, కార్యాలయ సిబ్బంది, శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రిబ్బన్ కట్ చేసి బాక్స్ క్రికెట్ ను ప్రారంభిస్తున్న టౌన్ సిఐ కరుణాకర్

బాక్స్ క్రికెట్ ప్రారంభించి ఆడుతున్న సీఐ





