
—కరీంనగర్ జిల్లా ఆర్ఎంపీ, పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ నవంబర్ 29: హుజూరాబాద్ మండలం శ్రీ విఘ్నేశ్వర ఆర్ఎంపీ, పిఎంపీ అసోసియేషన్ ఎన్నికలు హుజురాబాద్ లోని న్యూ శాతవాహన హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కొక్కుల రవీందర్ హుజురాబాద్ మండల అధ్యక్షులుగా గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా చిలుకమారి శ్రీనివాస్, కోశాధికారి ఎర్రోళ్ల సదానందం, గౌరవ అధ్యక్షులు కందగట్ల శ్రీనివాస్ ఎన్నిక అయ్యారు. ఈ సందర్బంగా అధ్యక్షులు కొక్కుల రవీందర్ మాట్లాడుతూ… హుజురాబాద్ లోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా సంఘం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందని, వారి హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకునేలా సంఘం తరఫున ప్రయత్నిస్తానని తెలిపారు. హుజూరాబాద్ మండల స్థాయిలో ఉన్నా సభ్యులందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెన్నమాధవుని నరసింహరాజు, జిల్లా సెక్రెటరీ పైడిపల్లి భీమన్న, జిల్లా కోశాధికారి కోళ్ల సంజీవరెడ్డి ,జిల్లా అధికార ప్రతినిధి గుడిపాటి సమ్మిరెడ్డి, జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు సంగెం ఐలయ్య, జిల్లా ఎథిక్ కమిటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , కరీంనగర్ జిల్లా డివిజన్ అధ్యక్షులు సుంకేనపల్లి రమేష్, కరీంనగర్ జిల్లా డివిజన్ సెక్రెటరీ వెంకటేష్ ,మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.




