
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన
అమరవీరుల కుటుంబాలకు, పోరాట యోధులైన ఉద్యమకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఓసి జేఏసీ, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివారం దీక్షా దివస్ సందర్బంగా హన్మకొండ లో అదాలత్ కూడలిలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఓసి జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీష్ రెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి, ప్రజా సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకిరి దామోదర్ లతో కలిసి ఓసీ ఐకాసప్రజా సంఘాల జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ 2009, నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సకల జనులను ఏకం చేసిందని, మలిదశ ఉద్యమం మలుపు తిరిగిన అపూర్వ ఘట్టం అని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ సమాజం సకల జనులు ఏకమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారని తెలిపారు. అమర వీరులు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారమే దేశంలోని చిన్న రాష్ట్రాల ఏర్పాటు సుగమ మైందని వారు గుర్తు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలను కలుపుకొని తమ సమాఖ్య తరపున కలుపుకొని తమ సమాఖ్య ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం నాయకులందరూ కలిసి బస్టాండ్ కూడలి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.




