
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్‌లోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో శనివారం రోజున గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతల పట్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞతలను తెలియజేసే ఉద్దేశంతో ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరిగిందనీ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు.


ఈ సందర్భంగా విద్యార్థులు తమ తాతయ్యలు, అమ్మమ్మలతో కలిసి వివిధ ఆటలు, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సరదా కార్యకలాపాల్లో పాల్గొని సందడి చేశారు. చిన్ననాటి అనుభవాలు, కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు, జీవన పాఠాలను పెద్దల ద్వారా తెలుసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు. విద్యార్థులు తమ తాతయ్యలు, అమ్మమ్మలకు ప్రత్యేకంగా గౌరవం తెలియజేస్తూ వారి ఆశీర్వాదాలను పొందారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పాఠశాల నిర్వహణను అభినందిస్తూ, పిల్లలతో గడిపిన సమయం తమకు ఎంతో ఆనందాన్ని, మధురమైన జ్ఞాపకాలను అందించిందని, తాతయ్యలు, అమ్మమ్మలు కుటుంబానికి మూలస్తంభాలని, వారి అనుభవం, ప్రేమ, విలువలు పిల్లల జీవితాలకు గొప్ప మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో పెద్దల పట్ల గౌరవం, కుటుంబ బంధాల పట్ల బాధ్యత, సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రాండ్ పేరెంట్స్ పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




