
—రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ పాషా
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ o రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఉస్మాన్ పాషా అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో రిటేడ్ ఉద్యోగుల ప్రత్యేక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిరంతరం చేస్తున్న కృషి చేస్తుందన్నారు.
ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పెండింగ్లో ఉన్న పీఆర్సీని ప్రకటించడంతో పాటు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మార్చి నెలలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983 నుంచి 1996 వరకు ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన విధంగా తెలంగాణలో కూడా అర్హులైన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద చికిత్స పొందేందుకు అర్హులైన పెన్షనర్లకు కొన్ని ఆసుపత్రులు చికిత్స నిరాకరిస్తున్న విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తూ చికిత్సకు నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగ. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 50 శాతం మంది పెన్షనర్లు మాత్రమే హెల్త్ కార్డులు పొందగలిగారని, మిగిలిన పెన్షనర్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులు, కుటుంబ పెన్షనర్లు సాంకేతిక సమస్యల కారణంగా హెల్త్ కార్డులు పొందలేకపోతున్నారని అన్నారు.ఈ సమస్యను రాష్ట్ర సంఘం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో, సంఘం ప్రాతినిధ్యం మేరకు డిసెంబర్ 2, 3 తేదీలలో యూనిట్ సంఘ కార్యాలయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు అందుబాటులో ఉండి, ఇప్పటివరకు హెల్త్ కార్డులు పొందని పెన్షనర్ల వివరాలను నమోదు చేసి, కార్డులు పొందేందుకు అవసరమైన సహకారం అందించనున్నారని తెలిపారు. ఇప్పటివరకు హెల్త్ కార్డులు పొందని పెన్షనర్లను గుర్తించి, వారి వివరాలను సేకరించి, వారికి సహాయం చేయాలన్నారు. ప్రతి పెన్షనర్కు హెల్త్ కార్డు అందేలా సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో హుజూరాబాద్ మండల అధ్యక్షులు గంజి జయవర్ధన్, కార్యదర్శి కోయల్కర్ దుర్గాజీ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొత్త మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గాజుల చారుదత్, కన్న ప్రభాకర్, సంయుక్త కార్యదర్శి జున్నుతల రామ్ రెడ్డి, ఆర్గనైజింగ్ గుంటి రాజయ్య, జిల్లా కౌన్సిలర్లు కాసర్ల శ్రీహరి, పి. గణపతి రెడ్డి, లక్ష్మీనారాయణ, దాసరి కనకయ్య, కొన్ని రాజిరెడ్డి, గోపాల్ రావు, తిరు నగరి రమేష్ కుమార్ పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




