
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: నవంబర్ 29న ఆదివారం కరీంనగర్లో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రాష్ట్ర ప్రజా సంఘాల నాయకు భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రజా సంఘాల జేఏసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు.
శనివారం ఉమ్మడి జిల్లా ప్రజా సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ రథసారధి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ 2009,నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ చరిత్ర లో చిరస్తాయిగా నిలిచిపోతుందని అన్నారు. కెసిఆర్ దీక్ష తోనే మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం అని సకల జనులు ఏకమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారని పోలాడి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామ న్నారు.విద్యార్థుల వీరోచిత పోరాటం,కళాకారుల చైతన్య స్ఫూర్తి,అమరవీరులు, ఉద్యమ కారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు
తెలంగాణ రాష్ట్రం కోసం అహింసా శాంతి మార్గంలో జరిగిన పోరాటాన్ని మహోన్నత ఉద్యమ చరిత్రను ఉద్యమ కారుల త్యాగాలను ప్రతి ఒక్కరం గుర్తించుకోవాలని
అమరుల త్యాగాలను నేటి తరానికి తెలియ జేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దీక్షా దివస్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని యావత్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని పోలాడి తెలిపారు.
అందుకే నవంబర్ 29 దీక్షా దివస్ ను యాదిలో ఉంచుకోవాలని దీని ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని పార్టీల కతీతంగా మద్దతుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ అమరుల కుటుంబాలను, ఉద్యమ కారులను గుర్తింపు ను వేగవంతం చేసి ప్రభుత్వం వారికి తగిన రీతిలో ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని పోలాడి రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




