
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రభుత్వం అందించిన నూతన డిజిటల్ రేషన్ కార్డులను మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, తాసిల్దార్ జక్కని నరేందర్, కమిషనర్ బి కిషన్ లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణంలో డిజిటల్ రేషన్ కార్డులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కోరికను పత్రిక ద్వారా తెలియజేసిన సూర్య దినపత్రికకు, స్పందించిన చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, తాసిల్దార్ జే నరేందర్, కమిషనర్ కిషన్ లకు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బి మొగిలి, వి వెంకటేశ్వర్లు, నాయకులు మేకల తిరుపతి, బండ నవీన్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, డీలర్లు సొల్లు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
@లోకల్ యాడ్స్@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




