Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని సబ్ జైలులో శనివారం న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ ఖైదీలకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కిరణ్ కుమార్ మాట్లాడుతూ….. తమ కేసు గురించి విచారణ జరుపుకునే ఆర్థిక స్తోమత లేని విచారణ ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయమందిస్తామని అన్నారు. బెయిల్ పొందడానికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తద్వారా వారికి లబ్ధి జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా న్యాయం పొందడానికి కేసులు తీసివేయడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ సదస్సులో హుజురాబాద్ సబ్ జైలు పర్యవేక్షణ అధికారి పి శ్రీనివాస్, అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ టి సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.



