
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 28: హుజురాబాద్ క్లబ్‌కు ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్యవర్గం శనివారం స్థానిక అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) వాసంశెట్టి మాధవిని మర్యాదపూర్వకంగా కలిసింది. క్లబ్ కార్యదర్శి కట్కూరి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు పుల్లూరి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

క్రీడా సౌకర్యాలు ఎంతో ఉపయోగకరం
హుజురాబాద్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోందని, తాను కూడా వాటికి క్రమం తప్పకుండా హాజరవుతున్నానని ఏసీపీ మాధవి తెలిపారు. క్లబ్‌లోని షటిల్, జిమ్, ఇతర క్రీడా సౌకర్యాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు.
అభివృద్ధికి పూర్తి సహకారం
క్లబ్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లి, అభివృద్ధికి కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. కార్యవర్గానికి తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాష్ట్రస్థాయి విజేతకు అభినందనలు
ఇటీవల రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో బహుమతులు సాధించిన ఏసీపీ మాధవిని క్లబ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి శివనాథుని వేణుగోపాల్, కోశాధికారి గర్రెపల్లి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గడ్డం ధర్మారెడ్డి, కేశిరెడ్డి నరసింహారెడ్డి, మేకల రాజిరెడ్డి, పూల్లూరి శ్రీకాంత్, గోలి సురేష్, అక్కినపల్లి అనిల్ సభ్యులు వర్దినేని రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




