Oplus_16908288
– ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరు ప్రభాకర్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూలై 29: నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు నాగార్జున డెయిరీ పాల ఉత్పత్తులు అని, పార్లర్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలిపించే విషయంలో నాగార్జున మిల్క్ డైరీ యాజమాన్యంను పలువురు అభినందించారు. అందరికీ అందుబాటులో నాగార్జున డైరీ పాల ఉత్పత్తులు, నమ్మకానికి నాణ్యతకు మారుపేరుగా నాగార్జున మిల్క్ డెయిరీ పాల ఉత్పత్తులు నిలుస్తున్నాయని, వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను విక్రయించడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని నాగార్జున మిల్క్ డెయిరీ ఎండి పుల్లూరి ప్రభాకర్ రావు తెలిపారు. ఇందులో పార్లర్ యజమాని నల్లగొండ సత్తయ్య, మార్కెటింగ్ విభాగం నుండీ నాగార్జున మిల్క్ డైరీ సేల్స్ మేనేజర్ పరుశురాం, మార్కెటింగ్ సిబ్బంది సుమన్ నేత, రాచకొండ అనిల్, శేఖర్, వంశీ, మాజీ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు నేరెళ్ల దేవయ్య, నాగార్జున మిల్క్ ఎజెంట్లు పాల్గొన్నారు.






