
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న హుజురాబాద్ డిప్యూటీ డిఎం హెచ్ ఓ చందు నాయక్ ని విధుల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ జిల్లా కలెక్టర్ కు సోమవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..హుజురాబాద్, జమ్మికుంటలో పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ అవుతున్న కనీసము పట్టించుకోకుండా ఒకవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్ల దగ్గర నుండి వచ్చిన కాడికి దండుకుంటూ రకరకాల టెస్టులో పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రజల దగ్గర నుంచి అందిన కాడికి దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నప్పటికీ హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ ఓ చందు నాయక్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రైవేట్ హాస్పటల్ పై పర్యవేక్షణ చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ డిఎంహెచ్వో చందు నాయక్ అవినీతి మత్తులో ఉంటూ ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కు డిప్యూటీ డిఎంహెచ్వో చందు నాయక్ కొమ్ముకాస్తున్నాడన్నారు. అతని పైన విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంబంధించిన అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, పద్మ శిరీష తదితరులు పాల్గొన్నారు.






