
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ కీ నేత, యువ నాయకులు లోకసభ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపాలిటీ చెర్మెన్ రొంటాల సుహాసిని ముందుగా కేక్ కట్ చేసి స్థానికులకు కేకులు, స్వీట్లు తినిపించి, రాహుల్ గాంధీ నిండా నూరేళ్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యుఐ నాయకులు, మహిళా విభాగం నాయకురాల్లు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






