
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు రెండవ రోజు కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి, మద్దతు ప్రకటించారు.


ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులవి గొంతెమ్మ కోరికలు కాదని న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలన్నారు. మున్సిపాలిటిలో పని చేసే జౌటోసోర్సింగ్ ఎన్ఎమ్ ఆర్ పిక్స్ పే కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 2వ పిఆర్సి ప్రకటించి కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి, కేటగిరి వేతనాలు అమలు చేయాలన్నారు.
మున్సిపాల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా డబుల్ బెడ్రూమ్స్, ఇందిరమ్మ ఇల్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.
మున్సిపాల్ కార్మికులకు మరణిస్తే దహనం ఖర్చులకు 30 వేల రూపాయలు ఇవ్వాలనీ ఒక్కపూట 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం మున్సిపాల్లో పనిచేసే శానిటేషన్, వాటర్ వర్క్స్ హరితహారం, ఎలక్ట్రిషన్, డ్రైవర్లకు రక్షణ పరికరాలు అందజేయాలన్నారు. మున్సిపాల్ పరిధిలో పనిచేసే డ్రైవర్లకు, జవాన్లకు మిగతా వారి వలె డ్రైవర్స్ కేటగిరి వేతనం ఇవ్వాలన్నారు. కార్మిక వర్గం తమ డిమాండ్ల కోసం ఆందోళన పోరాటాలు ఉధృతం చేయాలన్నారు.
సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉంటుందని కార్మికులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి అజ్జు, బి కుమార్, నాయకులు సులోచన, బోరగాల రాజ్ కుమార్, సంపత్ లతోపాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.





