Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్కో డిఈ ఉపేందర్ సూచించారు. గురువారం హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో విద్యుత్ అధికారులు ప్రజాబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యుత్తు ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కందాల శ్రీలత, ట్రాన్స్కో రూరల్ ఏఈ ఏ సతీష్ కుమార్, మాజీ సర్పంచి లక్ష్మారెడ్డి, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.






