
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ పాఠశాలలో కమెడియన్ షార్ట్ ఫిలిం షూటింగ్ శుక్రవారం జరిగింది. కరీంనగర్ కు చెందిన ఎన్నారై ఆశిష్ తను నిర్మాత, దర్శకత్వo వహిస్తున్న కమెడియన్ చిన్న సినిమా షూటింగ్ హుజురాబాద్ లో రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు ఆశిష్ మాట్లాడుతూ… ఒక పిల్లవాడి ప్రగతికి ఇతరులు ప్రోత్సాహం ఇస్తే ఎలా అభివృద్ధి చెందుతారో ప్రోత్సాహం ఇవ్వని పక్షంలో కసితో గొప్పవాడిగా మారే ఒక యువకుడి వృత్తాంతమే కమెడియన్ కథ అని అన్నారు. ఈ చిన్న సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరిగిందని, హీరో చిన్నప్పటి సన్నివేశాల గురించి హుజురాబాద్ లో షూటింగ్ చేశామని, డబ్బింగ్ ఇతర కార్యక్రమాల పూర్తయిన తర్వాత డిసెంబర్ నెలలో ఓటీటిలో దీనిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కరస్పాండెంట్ బి.రాజ్ కుమార్, శ్రీజన్, విశాల్ , కెమెరామెన్ తదితరులు పాల్గొన్నారు.

క్లాస్ రూమ్ లో చిత్రీకరిస్తున్న దృశ్యం…

నటీనటులతో దర్శక, నిర్మాతలు….
———-++——+++++++————+++——
##పత్రికా ప్రకటనలు&&
———–+++++++——-+++++————-
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@






