
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: శ్రావణమాసంలో మహిళలు పవిత్రంగా భావించే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణమాసంలోని శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు లక్ష్మీ అమ్మవారిని పూజించటానికి వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకుంటారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. దేవాలయాలకు వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించి తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. హుజురాబాద్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, సంతోష్ మాత ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, రామాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి సంతోషి మాత ఆలయంలో మహిళా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించారు. సాయంత్రం తమ ఇళ్లకు వచ్చిన మహిళలకు పసుపు, కుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. దేవాలయాల వద్ద భక్తుల సౌకర్యంకు ప్రత్యేక ఏర్పాట్లను దేవాలయ కమిటీలు నిర్వహించారు.

కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని పూజిస్తున్న భక్తులు….




అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటున్న భక్తురాలు…
——————–+++++++————————
@@పత్రికా ప్రకటనలు@@
—————–++++++++————————-
#&వార్షికోత్సవ శుభాకాంక్షలు&#






