
–నిత్యా ప్రసాదాలు
–దుర్గామాత సన్నిధిలో అన్నదానం
–మాజీ కౌన్సిలర్ దంపతులను అభినందించిన వార్డు ప్రజలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు లో గల పాత వెంకటేశ్వర టాకీస్ లో 8 రోజులుగా చిన్న బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యం ఒక చీర బహుమతిగా అందచేయడమే గాకుండా, దాతల సహాయంతో రోజు రెండు రకాల ప్రసాదాలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అందచేశారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, మరుసటి రోజు నుండి మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సిహారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి చిన్న బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మైక్ , లైటింగ్, మంచి నీటి సౌకర్యంతో పాటు, ప్రసాదం పంపిణీ చేసి వార్డు ప్రజల మన్ననలు పొందారు. మొదటి రోజు చీర బహుమతి ని కమిషనర్ సమ్మయ్య అందచేయగా, తర్వాత రోజు నుండి లావణ్య చేతుల మీదుగా అందచేశారు. చిన్న బతుకమ్మ చివరి రోజు స్థానిక సుజాత హాస్పిటల్ వారి సౌజన్యంతో 5 చీరలు డ్రాలో వెళ్ళిన మహిళలకు బహుమతిగా అందచేశారు. అదే విధంగా వెంకటేశ్వర టాకీస్ లో రుద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత సన్నిధిలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సిహారెడ్డి ఆధ్వర్యంలో రుద్ర యూత్ అసోసియేషన్ ఈ అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వార్డులోని ప్రజలు, వ్యాపారులు, హమాలీ, గుమాస్తాలు తదితరులు పాల్గొన్నారు. సుమారు మూడు వందల మంది పాల్గొన్నారు. దుర్గామాత ఏర్పాట్ల కోసం రూ.10,116 మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య యూత్ అసోసియేషన్ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఇనుగాల గోవర్దన్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, ముషం వెంకన్న, పుల్లూరి శ్రీకాంత్, ఇల్లందుల తిరుపతి, భూపతి వెంకటరమణ, పత్తి శ్రీరాంరెడ్డి, భాషబత్తిని సతీష్, కన్నూరీ సురేష్, నవీన్, కృష్ణ, అనీల్ , రవీంద్రచారి, అనుదీప్, భాస్కర్, కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

26వ వార్డులో బతుకమ్మలతో మహిళలు…



26వ వార్డులోని పత్తి వాసుదేవరెడ్డి కాంప్లెక్స్ వద్ద బతుకమ్మలు ఆడుతున్న మహిళలు, యువతులు

బతుకమ్మతో 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య…

26వ వార్డులో చిన్న బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు చేసిన స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి దంపతులు..

బతుకమ్మ ఆట పాటలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతిగా చీరలు అందజేస్తున్న కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్ దంపతులు..



తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకల్లో మహిళలకు అందజేసిన చీరలు ఇవే..

దుర్గాదేవి నిర్వాహకులకు విరాళం అందజేస్తున్న కౌన్సిలర్ దంపతులు..


దుర్గాదేవి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కౌన్సిలర్ దంపతులు లావణ్య నరసింహారెడ్డి…


తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య- నరసింహారెడ్డి దంపతులను సత్కరిస్తున్న 26వ వార్డు ప్రజలు, అభిమానులు..





