
–నియోజకవర్గ ప్రజలకు దుర్గామాత ఆశీస్సులు ఉండాలని, అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచంలో పూలను దైవంగా భావించి తొమ్మిది రోజులు దైవంగా కొలుచుకొని మళ్ళీ అదే పూలను ప్రకృతి ఒడిలోకి పంపించే గొప్ప పండుగ బతుకమ్మ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలోనీ అన్ని మండలాల్లో ఆయన పర్యటించారు. మహిళలతో బతుకమ్మ ఆడుతూ వారికి ఉత్సాహాన్ని కలిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేస్తూ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుందని, ఆ దుర్గామాత ఆశీర్వాదం వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాల్లు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.



హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతున్న ప్రణవ్.. పెద్ద ఎత్తున హాజరైన పట్టణ ప్రజలు..


బతుకమ్మనెత్తిన ఎత్తుకొని కార్యకర్తలతో కాంగ్రెస్ నేత ప్రణవ్..

జమ్మికుంట పట్టణంలో బతుకమ్మలను ఎత్తుకొని మహిళలతో…

జమ్మికుంటలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్…


దుర్గాదేవి దర్శించుకుని పూజలు చేస్తున్న ప్రణవ్…






