
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంగా డి కృష్ణారెడ్డి హాజరై ముందుగా గాంధీ విగ్రహానికి, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అనేక దేశాలు నేటికీ ఆయన మార్గాలను అనుసరిస్తున్నాయని తెలిపారు. మనం కూడా మహాత్మగాంధీ ఆశయాలను పాటిస్తూ, వాటిని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. హక్కుల సాధనకే శాంతితో పోరాటాన్ని బోధించి ఆచరణలో చూపిన మహాత్మాగాంధీ చిరస్మరణీయులన్నారు. ప్రపంచానికి అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాలు అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం, అనుసరణీయమన్నారు. మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో, 1965 ఇండో, పాకిస్తాన్ యుద్ధ కాలంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించారని ఆయన గుర్తు చేశారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో లాల్ బహుదూర్ శాస్త్రి దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, సీనియర్ నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, బోరగల సారయ్య, కొడిమ్యాల పవన్, కొలిపాక వెంకటేష్, క్యాస వెంకటేష్, తుర్పాటి రాజశేఖర్, పర్థం రాము తదితరులు పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలల అర్పిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు, నాయకులు..

మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బిజెపి నాయకులు...
—————–+++++++—————-
**లోకల్ యాడ్స్**
————-++++++++——————-
&**దసరా శుభాకాంక్షలు**&

&&మద్దుల ప్రశాంత్ పటేల్ తరఫున దసరా శుభాకాంక్షలు &&

##దేవి ఎంటర్ప్రైజెస్ వారి దసరా శుభాకాంక్షలు##

&&విహెచ్పి హుజురాబాద్ మండల శాఖ తరఫున దసరా శుభాకాంక్షలు &&

&పిఎసిఎస్ తుమ్మలపల్లి శాఖ తరపున దసరా శుభాకాంక్షలు &





