
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, అక్టోబర్ 3: జీహెచ్ఎంసీ నిధులు రూ 52.03 కోట్ల వ్యయంతో నిర్మించిన సికింద్రాబాద్ – ఫలక్నుమా బ్రాడ్గేజ్ లైన్లోని ఫలక్నుమా వద్ద ఆర్ఓబీకి సమాంతర ఆర్ఓబీనీ శుక్రవారం హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసుదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, మీర్ జల్ఫికర్ అలీ ,జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్వీ కర్ణన్, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ లు,తదితరులు పాల్గొన్నారు.
ఆర్వోబీ ప్రారంభంతో…ఫలక్ నుమాలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
పాతబస్తీ ఫలక్ నామాలో నేటి నుంచి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఫలక్ నామా బ్రాడ్ గేజ్ లైన్ వద్ద ఉన్న ఆర్వోబీకి సమాంతరంగా జీహెచ్ఎంసీ ఆర్వోబీ నీ నిర్మించింది.
రూ.52. కోట్లతో 4 వరుసల్లో ఆర్వోబీని జీహెచ్ఎంసీ నిర్మించింది. పాత ఆర్వోబీని పునరుద్దరించడంతో పాటు దానికి సమాతరంగా మరో ఆర్వోబీని నిర్మించడంతో బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్ నామా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. సమయం ఆదాతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది. ఫలక్నుమా ఆర్ఓబీనీ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

శిలాఫలకం ఓపెన్ చేసి ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్..


మేయర్ విజయలక్ష్మితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్

—————++++++++—————
##లోకల్ యాడ్స్##
————–++++++———————
&&దసరా శుభాకాంక్షలు&&










