
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతంలో భాగంగా కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గుంజపడుగు హరిప్రసాద్ ను జిల్లా నూతన అధ్యక్షుడిగా నియామక ఉత్తర్వులను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విడుదల చేయడం జరిగింది.
ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని నియామక ఉత్తర్వులలో వారు పేర్కొనడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం చేయాలని అలాగే బిసి ఉద్యమాన్ని సైతం ముందుకు తీసుకెళ్లాలని జాగృతి చేపట్టే సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలని వారు సూచించడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవితక్క నామీద ఎంతో నమ్మకంతో జిల్లా జాగృతి అధ్యక్షుడిగా నియమించారు వారి నమ్మకానికి అనుగుణంగా కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం కోసం మరియు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి బిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు కవితక్క నాయకత్వంలో వారు ఇచ్చే ప్రతి సూచనలను సలహాలను పాటిస్తూ కరీంనగర్ జిల్లాలో నాయకులందరినీ కలుపుకొని జాగృతి బలోపేతానికి కృషి చేస్తానని నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన కవితక్క గారికి మరియు నా నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో జిల్లా జాగృతి నూతన అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్….

జిల్లా జాగృతి నూతన అధ్యక్షుడిగా నియామకమైన గుంజపడుగు హరిప్రసాద్…
—————–+++++++—————–
**లోకల్ యాడ్స్**
————–+++++++——————-
&&దసరా శుభాకాంక్షలు&&










