
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లుగా బార్ ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్ ఎన్నిక చెల్లదని, దానికి చట్టబద్ధత లేదని ఎన్నికల ద్వారా ఎన్నికైన బార్ అధ్యక్షుడు యతిపతి అరుణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులందరి సమక్షంలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన తనను తొలగించే అధికారం కొందరు సభ్యుల తీర్మానం చెల్లదని, శ్రీనివాసును ఎన్నుకున్నట్లు ప్రకటించిన ఆ ప్రకటనలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తనను తొలగించే అధికారం బార్ కౌన్సిల్ సభ్యులందరి సమక్షంలో వన్ బై థర్డ్ మెజార్టీతో, తాను చేసిన తప్పులను నిరూపించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారుల నిర్ధారణ అనంతరం మాత్రమే ఉంటుందన్నారు.

న్యాయవాది యతిపతి అరుణ్ కుమార్..





