
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ సీనియర్ రాజకీయ వేత్త, పోతిరెడ్డిపేట గ్రామ మాజీ సర్పంచ్, ఎస్ ఆర్ ఎస్ పి లోయర్ మానేర్ డ్యాం నీటి సంఘాల డిస్త్రి బ్యూటరీ కమిటీ మాజీ అధ్యక్షుడు చొల్లేటి కిషన్ రెడ్డి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శనివారం పొత్తిరెడ్డిపేటలోని వారి స్వగృహాన్ని నాయకులతో కలిసి పోలాడి రామారావు సందర్శించి కిషన్ రెడ్డి పార్టీవ దేహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుని కుమారులు అభిషేక్ రెడ్డి, వివేక్ రెడ్డి, భార్య లావణ్యను, ఇతర కుటుంబ సభ్యులను పోలాడి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు.
చోల్లేటి కిషన్ రెడ్డి హుజురాబాద్ ప్రాంతంలో సీనియర్ రాజకీయ వేత్తగా పార్టీల కతీతంగా అందరూ గౌరవించే వారని స్నేహ శీలిగా సామాన్యుల సమస్యలు పరిష్కరించే వారని, గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పుడు అప్పటి మాజీ మంత్రులు ముద్దసాని దామోదర్ రెడ్డి, ఇనగాల పెద్దిరెడ్డిల సహకారంతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడినీ గ్రామానికి రప్పించి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి చట్టు పక్క గ్రామాల అభివృద్ధికి పాటు పడ్డారని, గ్రామాభివృద్ధికి ఎంతో సేవ చేశారని గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా ఆవేదన్ చెందుతున్నారని రామారావు నివాళులు అర్పించారు.
మాజీ శాసన సభ్యుడు కేతిరెడ్డి సాయిరెడ్డి శిష్యునిగా, హుజురాబాద్ డివిజన్ ఓసి సంఘాల నాయకుడిగా ఉండి, రైతు ప్రజాసంఘాల నాయకులతో కలిసి హుజురాబాద్, మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఎంతో సేవ చేశారని వారి సేవలు చిరస్మరణీయం అని ఆత్మీయ స్నేహ శీలిని కోల్పోవడం బాధాకరం అని పోలాడి రామారావు కన్నీరు మున్నీరు అయ్యారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు వారి జ్ఞాపకార్థం హుజురాబాద్ కెనాల్ క్యాంప్ ప్రథాన రహదారిలో రైతు ప్రజాసంఘాల తరపున కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పోలాడి రామారావు ప్రకటించారు.
రామారావు వెంట రైతు మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, నాయకులు ఎడ వెళ్ళి కొండాల రెడ్డి, కంకనాల విజయారెడ్డి, భదవాన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, పోల్సాని రామారావు , కల్లెపు మోహన్ రావు తదితరులు ఉన్నారు.

మృతి చెందిన చెల్లేటి కిషన్ రెడ్డి పార్థివ దేహం..

కిషన్ రెడ్డి (ఫైల్ ఫొటో)

కిషన్ రెడ్డి పార్తివదేహానికి పూలమాల వేసే నివాళులర్పిస్తున్న పోలాడి రామారావు..






