
–ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇప్పలపెల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు
– ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణవ్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారిపై గల కూడలిలో పూలే ఉత్సవకమిటీ అధ్యక్షులు ఇప్పలపెల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణవ్ హాజరయ్యారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే దంపతులు బాలబాలికల చదువు కోసం ఆ కాలంలో చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వొడితెల ప్రణవ్ మాట్లాడుతూ.. అక్షరయోధుడు జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. ఆయన జీవితం అందరికి ఆదర్శమని అన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అది అందరి హక్కు అని, అక్షరాస్యత అందరికి అందాలని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పూలే ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి తులసి లక్ష్మణమూర్తి, గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, ఉప్పు శ్రీనివాస్, సందెల వెంకన్న, బుర్ర కుమార్, ఉపాధ్యక్షులు మార్త రవీందర్, మధు, చిలకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్ అధ్యక్షత వహించగా, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, డైరెక్టర్లు మాచర్ల నరేష్, పూర్ణచందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, కాంగ్రెస్ పట్టణ మహిళా అద్యక్షురాలు యేముల పుష్పలత, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం, ప్రభాకర్, రామ్ రాజేశ్వర్, ఖలీద్ హుస్సేన్, జలీల్, అప్సర్, తౌసిఫ్, ఏం శ్రీనివాస్, రాజ్ కుమార్, సొల్లు బాబు, ఎర్ర రవీందర్, బీఆర్ గౌడ్, సందమల్ల బాబు, బండారి సదానందం, మార్త రవీందర్, కేఆర్ బిక్షపతి, మిడిదొడ్డి రాజు, సదానందం, ప్రతాప నాగరాజు, మైఖేల్ శ్రీను, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



ఫూలే చిత్రపటానికి పూలమాల చేసే నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జి ప్రణవ్, నిర్వహణ కమిటీ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు..





