
– నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల ప్రధాన కూడళ్లలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.
– దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న కౌశిక్ రెడ్డి.
– సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హుందాగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఇలాంటి పద్ధతి మార్చు కోకపోతే భౌతిక దాడులకు సైతం వెనకాడబోమని హుజూరాబాద్ కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. శుక్రవారం రోజున హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రోటోకాల్ గురించి నీతులు చెప్పే కౌశిక్ రెడ్డి ప్రోటోకాల్ లో ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం సిగ్గు చేటని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డికి భయమని అందుకే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసే సమయంలో ముఖ్యమంత్రి ఫోటో లేకుండా చెక్కులు పంచుతున్నాడని ఆది భయం కాదా అని అన్నారు. పైకి గంభీరపు మాటలు మాట్లాడుతూ లోలోపల భయపడే వ్యక్తి కౌశిక్ రెడ్డి అని, ఎమ్మెల్యే అధికార నివాసాన్ని తన పార్టీ ఆఫీసుగా మార్చుకొని ప్రోటోకాల్ తప్పుతున్న కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. బుద్ధి మార్చుకొని హుజూరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ఓట్లు వేయకపోతే చస్తాం అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి, గెలిచిన తరువాత రూపాయి నిధులు తీసుకురాకపోగా హుజురాబాద్ పరువు తీస్తున్నాడనీ ఆరోపించారు. ఇకపై కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై చిల్లర మాటలు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీతో చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు..

కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు..






