
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థులకు భోజనం అందించే వంట గదుల పరిశుభ్రత పట్ల బాధ్యులు శ్రద్ధ వహించాలని, ప్రజలు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, ఐసిడిఎస్ సిడిపిఓ సుగుణ పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల అంగన్వాడీ కేంద్రాల వంట గదులన వారు సందర్శించి పరిశీలించారు. వంట గదుల పరిశుభ్రత పట్ల పాఠశాల వంట చేసేవారు తగిన శ్రద్ధ వహించాలని, ప్రధానోపాధ్యాయులు సైతం పరిశీలించాలని అన్నారు. పరిశుభ్రత లేకపోవడం వల్ల జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల సూచనలు మేరకు హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అంగన్వాడీ కేంద్రాల వంటగదులను పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడం వల్ల వారు ఎలాంటి అనారోగ్యానికి లోను కారని అన్నారు వంట గదుల పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించకపోతే పిల్లలకు ఇబ్బంది అవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తాముండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం విధిగా భావించాలన్నారు. స్థానిక పరిసరాలను పరిశీలించినప్పుడు అపరిశుభ్రంగా ఉండడంతో అప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి రోడ్లను పరిశుభ్రం చేయించారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండటం వల్ల మంచి ఆహారం పిల్లలకు భుజించే వీలు కలుగుతుందన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని పాఠశాలల వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవసరమైన వారు మున్సిపల్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న హింసలను అరికట్ట ఎందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ మహిళా హింస నివారణ దినోత్సవం పురస్కరించుకొని మహిళల అక్రమ రవాణా అరికట్టాలని, మహిళల పట్ల దయా, కరుణ, ప్రేమ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, మామిళ్ల వాడ హెల్త్ సబ్ సెంటర్ వైద్యురాలు జారినా, ఐసిపిఎస్ వాలంటీర్ రమేష్, జెండర్ స్పెషలిస్ట్ శైలజ, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ్య, ఏఎన్ఏం వసంత, అంగన్వాడి టీచర్ కొలిపాక అంజలి, ఆయా కొలిపాక స్వప్న, ఆశా కార్యకర్త, ఇతర సిబ్బంది, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు

మాట్లాడుతున్న జెండర్ స్పెషలిస్ట్ శైలజ..

మహిళల అక్రమ రవాణాపై వివరిస్తున్న మహిళా అధికారులు..

పరిసరాల పరిశుభ్రత పై, హ్యాండ్ వాష్ పై చిన్నారుల వివరిస్తున్న అధికారులు..





