
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్లోబల్ షోటోకాన్ కరాటే అకాడమీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన కరాటే విద్యార్థులు జియస్.కేడీ కరాటే అకాడమీ నిర్వహించిన జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిభ చూపించిన కరాటే విద్యార్థులను 12 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ తో పాటు జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2026ను కైవసం చేసుకున్నారు. షాడో చోటో కాన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఆర్గనైజర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ – 2026….హనుమకొండ గిరిజన భవన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పాల్గొనగా హుజురాబాద్ నుండి14 మంది విద్యార్థులు పాల్గొనీ 12 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ వివిధ కేటగిరిలలో అమ్మాయిల విభాగం మరియు అబ్బాయిల విభాగంలో పాల్గొని బహుమతులు సాధించినట్లు ఎస్కే జలీల్ తెలిపారు. కాగా బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించిన హుజురాబాద్ బిఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ కరాటేతో సమాజంలో అమ్మాయిలకి అవసరం అని మరియు గంజాయి డ్రగ్స్ అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్నారు. క్రమశిక్షణతో చదువు నేర్చుకోవడం మంచి అలవాటు అని అన్నారు. కరాటే విద్యార్థులు రాబోయే రోజులలో గురువులకు సొంత ఊరుకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతూ జాతీయస్థాయిలో కరాటే బహుమతులు సాధించిన విద్యార్థులకు మెడల్, సర్టిఫికెట్ తో పాటు విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, సదానందం, ఆల్ పెన్షనర్ రిటైర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, మాజీ ఎంపీపీ పి వెంకట్ రాజం, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్ మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్, రిటైర్ పిడి సారయ్య, సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరి, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, కొలిపాక సమ్మయ్య, కాంగ్రెస్ మహిళ నాయకురాలు గోస్కుల మధు నాగమణి, తులసి లక్ష్మణమూర్తి, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి సలీం, ప్రవీణ్ జాతీయస్థాయి కరాటే పోటీలలో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.





జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులను సన్మానిస్తున్న అతిథులు…





