
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మద్దతుతో ధర్మ సమాజ్ పార్టీ విశారధన్ మహరాజ్ బలపరిచిన 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాటూరి మౌనిక కు వెల్లువెత్తుతున్న ఓటర్ల ఆధరణ. అంతే కాక ఆమే ప్రకటించిన మానిఫెస్టో లోని అంశాలు ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకోవడమే గాక ఆమెకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆలోచింప చేస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో
90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు చట్టసభలో 90% వాటా కావాలి అని లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్న డాక్టర్ విశారధన్ మహారాజ్ నాయకత్వం వర్ధిల్లాలి..అంటూ హోరెత్తుతోంది.
ఒక సామాజిక కార్యకర్త పురపాలక సంఘం కౌన్సిలర్ గా గెలిచి హుజురాబాద్ పట్టణమును అభివృద్ధి పథంలోకి నడిపించడంలో భాగస్వామ్యం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. 16వ వార్డులో నెలకొన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న మాటూరి మౌనికకు తమ మద్దతు ఉంటుందంటూ స్థానికులు భరోసా ఇస్తున్నారు అన్నారు. ప్రతి సంవత్సరం 16వ వార్డు పరిధిలోని మామిండ్లవాడ, గ్యాస్ గోదాం ఏరియాలో తాగునీటి సమస్య, మురుగు కాలువలు సిసి రోడ్లు, వీధిలైట్ల నామమాత్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు గత పాలకులు ఎవరు కృషి చేయలేదని అక్కడి ప్రజలు మౌనిక దృష్టికి తీసుకువచ్చారు. అందుకని చక్కని మేనిఫెస్టో ప్రచారంలో ముందుకు సాగుతున్నామని ఆమె వెల్లడించారు. వార్డు ప్రజలు కోల్పోయిన నల్లాల బావిని తిరిగి సాధించుకుందామని, అక్కడ రెండు పెద్ద బోర్లు వేసి పాత నల్ల నీటిని తిరిగి తెచ్చుకుందామని, అక్కడే బాల వికాస కేంద్రం పెట్టి ఐదు రూపాయలకు 20 లీటర్ల చొప్పున తాగునీరు పోద్దామని తెలపడం జరుగుతుందన్నారు. అంతేగాక 21 మందితో ఒక కమిటీ వేసుకుని వార్డు అభివృద్ధిలో అందరం బాగా స్వాముల అవుదాం అన్నారు. కమ్యూనిటీ హాల్ భవనం కట్టుకొని సమావేశాలు నిర్వహించు కుందామన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే మన పారిశుద్ధ కార్మికులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ సాధించుకుందామని ఇంకా మన వార్డులో అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకునేందుకు నా టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నేను ఇచ్చిన మానిఫెస్టో ప్రకారం అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని మౌనిక ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు.


ఓటర్లను ఆకట్టుకుంటున్న మౌనిక మానిఫెస్టో…


మామిండ్లవాడలో ప్రచారంలో దూసుకుపోతున్న మౌనిక….

ఓటర్లకు తన మేనిఫెస్టో కరపత్రాలు అందజేసి వివరిస్తున్న మౌనిక…

మౌనిక ప్రచారానికి హోరెత్తిన ఓటరాభిమానం…





