
–నాలుగోసారి కూడా విజయం కేసిరెడ్డి లావణ్యదేనా!?
–ఇంటెలిజెన్స్ నివేదికలోనూ..కారు విజయం
అన్ని పార్టీలకు చేరిన సమాచారం?
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి9: హుజురాబాద్ మున్సిపాలిటీ 26వ వార్డులో విభిన్న రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. మెజారిటీ వార్డుల్లో త్రిముఖ పోటీ జరుగుతుండగా 26వ వార్డులో మాత్రం ఏకపక్షంగా ఉంది. ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థిగా కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి నాలుగోసారి బరిలో ఉన్నారు. గతంలో మూడు సార్లు ఎన్నికై వార్డు అభివృద్ధికి కృషి చేసారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్నారు. ప్రతినిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించడం వలన ఇక్కడ పోటీ ఏకపక్షంగా మారుతోంది. అన్ని వీధుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్యం సమర్థవంతంగా ఈ వార్డులో 💯 నిర్వహించి ప్రజలతో భేష్ అనిపించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నాం అనే విధంగా లావణ్య నర్సింహరెడ్డి పనిచేస్తున్నారు. ఎలాంటి గర్వం లేకుండా అందరితోనూ కలుపుగోలుగా, స్నేహ పూర్వకంగా ఉండడం వారి విజయానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరి మాటను అధికారులు వింటారు..ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనులు వెనువెంటనే జరుగుతాయి..ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పని పూర్తయ్యేదాకా వెంట ఉంటారు.. భరోసా ఇస్తారు…అనే ధీమా ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. పదిహేనేళ్ల క్రితం ఈ వార్డులో అన్ని సమస్యలే ఉండేవి. ఎక్కడ చుసినా రోడ్లపై మురుగునీరు, దుర్వాసన, పందుల కంపు కనిపించేవి. లావణ్య నర్సింహారెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుని సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చారు. 26 వార్డును హుజురాబాద్ లో ఆదర్శ వార్డుగా నిలిపారు. ఇంటెలిజెన్స్ నివేదికలోనూ సగానికి పైగా ఓట్లతో బిఆర్ ఎస్ అభ్యర్థి కేసీరెడ్డి లావణ్య విజయం సాధిస్తారని సర్వే నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని సర్వేల్లోనూ.. 26వ వార్డ్ విజయం లావణ్యదే అని వెల్లడవుతోంది. గత వారం రోజులుగా లావణ్య తన ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసారు. సూపర్ బజార్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రోడ్ షో నిర్వహించి లావణ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. కారు గుర్తుకు, కేశిరెడ్డి లావణ్యకు పెట్టని కోటలా, శత్రు దుర్భేద్యమైన కోటలా 26వ వార్డు ఉండడంతోపాటు ఇక్కడ కారు గుర్తు విజయం ఖాయమన్న సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఏదేమైనా హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 26వ వార్డు ప్రత్యేకత సంతరించుకునే అవకాశం ఉంది. నాలుగు సార్లు గెలిచి రికార్డులు కొట్టనుంది. ఒకే పార్టీ, ఒకే అభ్యర్థి, ఒకే పార్టీ అనే విషయంలో మున్సిపల్, రాష్ట్ర రికార్డులు సృష్టించి ప్రజలు తమ గొప్ప విజయం అందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ తీస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి లావణ్య-నరసింహారెడ్డి మద్దతుదారులు..












