
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి09 : 22వ వార్డు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజమైన ప్రగతి కాముకులను గుర్తించి బిఆర్ఎస్ కు ఓటు అభివృద్ధికి పునాది లాంటిదిగా గుర్తించి ఓటు వేయాలని, హుజురాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని 22వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల– ప్రసాద్ అన్నారు. సోమవారం నిర్వహించిన ఇంటి ఇంటి ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వాడ వాడన ప్రత్యేక కమిటీలని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకతీయ కాలనీ, ఇస్లాంనగర్ ప్రాంతాల్లో అధ్వాన్నంగా పెద్ద మురికి నీటి కాలువ ఉండి ఆ సలంలో వరదనీటి మళ్లించేందుకు మురికి నీటి కాలువ స్థలంలో వరదనీటి డ్రైనేజీని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అవసరమున్న ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.
డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. రోడ్లు, వీధిదీపాలు, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తానని శ్యామల – ప్రసాద్ స్పష్టం చేశారు. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని, తనను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను వేడుకున్నారు. ఎన్నికలవేళ ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన అందుబాటులో ఉండి తలుపు తడితే వచ్చి పని చేసే వారిని గుర్తించి ఓటు వేయాలన్నారు.








(1) 22వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి తన కుక్కల శ్యామల ప్రసాద్ కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న ఆ వాడ సీనియర్ నాయకుడు చందా గాంధీ.
(2) బిఆర్ఎస్ అభ్యర్థి తన కుక్కల శ్యామల ప్రసాద్ కారు గుర్తుపై ఓటు వేయాలని ర్యాలీ తీస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి, నాయకులు, కార్యకర్తలు
(3)ఇంటి ఇంటి ప్రచారములో వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్న శ్యామల ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు..





