
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ లోని దమ్మక్కపేటకు చెందిన సీనియర్ నాయకుడు కే రవీందర్ రెడ్డి మరియు అతని సతీమణి బిఆర్ఎస్ పార్టీలో చేరారనీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, తాము ఏ పార్టీలో చేరలేదని వారు మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటించుకోవడం సరికాదన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించేలా తాము బిఆర్ఎస్ పార్టీలో చేరామని ఎమ్మెల్యేకు అండగా ఉంటామని ప్రకటించుకోవడం సరికాదన్నారు.

సర్పంచ్ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పొగరు సదానందంతో కలిసి వచ్చిన చిత్రం.. ఆయన ఆ పార్టీ మారీ రెండు వారాలు దాటింది.. గమనించగలరు.
సర్పంచ్ ఎన్నికల ముందు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హనుమకొండలోని తమ ఇంటికి వచ్చి పార్టీలోకి రావాలని కోరింది వాస్తవమే కానీ తాము ఇప్పుడే ఏలాంటి నిర్ణయం తీసుకోమని అప్పుడే స్పష్టం చేశామన్నారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నేత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమలాంటి వారిని బలి చేయడానికి, బధనం చేయడానికి ఊరికే తీసుకుంటా అని చెప్పి నెల రోజుల క్రితం తీసుకున్న ఫోటోలను ఇప్పుడు మీడియాలో వైరల్ చేయాలని చూడడం బాధాకరమని, రాజకీయం కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సరికాదన్నారు.
తమ గ్రామం దమ్మక్కపేట సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజుల క్రితం వచ్చి తమ మద్దతు కోరగా పార్టీలో చేరగానీ పరోక్షంగా సహకరిస్తానని హామీ మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు.దీంతో కుట్రలో భాగంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ కండువా కప్పుకున్నామని మీడియాకు వెల్లడించడం సరికాదన్నారు. తనపై ఎంతో విశ్వాసముంచిన గ్రామ ప్రజలు, తన అభిమానులు, తన మద్దతుదారులను అనుసరించి మున్సిపల్ ఎన్నికల్లో నడుచుకోవడం జరుగుతుందని, తన అనుచరులను, అభిమానులను తప్పుదారి పట్టించేందుకే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాము బిఆర్ఎస్ లో చేరినట్లు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మీడియాకి ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు కే రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.

సర్పంచి ఎన్నికల ముందు మాట్లాడేందుకు వచ్చిన ఎమ్మెల్యే అతనితో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు..

మేం కలిసినట్లుగా గుర్తుంటుందని నాడు ఊరికే ఎమ్మెల్యే మా దంపతులతో తీసుకున్న ఫోటోను ఇప్పుడు వైరల్ చేస్తున్నాడూ….





