
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని రెండవ వార్డ్ నాలుగవ పోలింగ్ బూత్(కాకతీయ స్కూల్) నుండి సోషల్ మీడియాలో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ వైరల్ అవుతుంది.
మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ లో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా బీజేపీ అభ్యర్థి దున్నపోతుల ఎల్లమ్మ పోటీ చేస్తుంది. ఆమె తరపున ఓటు వేయాలని అభ్యర్థించిన సన్నిహితులు.. దీంతో ఓటు వేసిన పల్లపు సాయి బ్యాలెట్ పేపర్ అతని దగ్గర వ్యక్తి అయిన టి అశోక్ కు చూపించిన అనంతరం ఎన్నికల నిబంధనలు తెలవక సోషల్ మీడియాలో అతడు పెట్టడంతో అది వైరల్ గా మారింది.
అయితే ఎన్నికల సంఘం పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ సెల్ ఫోన్ లు పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకెళ్ళావాద్దన్న నిబంధనలు ఉన్న సెల్ఫోన్ పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్ళింది అనేది అంత చిక్కని ప్రశ్నగా మారింది. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ మరచి అధికారుల ఎదురుగా బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి ఉండగా తన సెల్ ఫోన్ ఫోటో కొట్టుకొని బయటికి వచ్చే అంత వరకు ఎవరు గమనించకపోవడం, దానిని సోషల్ మీడియాలో వైరల్ గా చేయడంపై.. ఎలా ఫోటో బయటకి వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోలింగ్ బూత్ అధికారి పిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నా పోలీస్ ఉన్నతధికారులు స్పష్టం చేశారు.

రెండవ వార్డులో బిజెపి తరఫున పోటీ చేస్తున్న దున్నపోతుల ఎల్లమ్మకు ఓటేసినట్లుగా ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతున్న దృశ్యం.





