Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రంజాన్ మాసం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని 22వ వార్డు కాకతీయ కాలనీ ఇస్లాంపురలో ముస్లిం సోదరులకు స్థానిక కౌన్సిలర్ వడ్లూరి శ్రీలేఖ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీలేఖతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని, నెల రోజులపాటు కఠిన నియమాలతో అల్లాను ప్రార్థించే ముస్లింల భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. అల్లా దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు.
వడ్లూరి శ్రీలేఖ మాట్లాడుతూ మతాలకతీతంగా ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం సోదర భావాన్ని పెంపొందించి లౌకిక విలువలను కాపాడుతుందని అన్నారు. సర్వ మతాలను సమానంగా ప్రేమించే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా అండగా నిలువాలన్నారు. కాగా ఇటీవల కౌన్సిలర్ గా ఎన్నికైన శ్రీలేఖ దంపతులను, ఖలీద్ హుస్సేన్, బండ వెన్నెల నవీన్ తదితరులను శాలువాలతో ముస్లిం నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ ఇఫ్తార్ విందులో జామే మస్జిద్ ఈద్గా & ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, కౌన్సిలర్లు మహమ్మద్ ఖలీల్ హుస్సేన్, బండ వెన్నెల నవీన్, మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, మక్కా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజీమ్, మాజీ అధ్యక్షుడు ఖాజా బద్రోద్దీన్, మక్కా మస్జిద్ ఇమామ్ సోహెల్ తో పాటు ముస్లిం నాయకులు సయ్యద్ సలీం, ఆలీం, మహమ్మద్ మురాద్ హుస్సేన్, మక్సుద్, మహమ్మద్ బాషుమియా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ సర్వర్, మహమ్మద్ అజీజ్, కాంగ్రెస్ నాయకుడు కాజీపేట శ్రీనివాస్, టేకుల శ్రవణ్, ఇప్పలపల్లి చందు, బిఆర్ఎస్ నాయకుడు తలకొక్కుల హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో పండ్లు ఆరగిస్తున్న ముస్లిం నాయకులు, ముస్లిం సోదరులు..



మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ కు పండు తినిపిస్తున్న ముస్లిం నాయకుడు..

ఇఫ్తార్ విందులో అతిథులకు పండ్లు తినిపిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు..

కౌన్సిలర్ వడ్లూరి శ్రీలేఖ దంపతులను సన్మానిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు..

ఇటీవల ఎన్నికైన నూతన కౌన్సిలర్ సభ్యులను శాలువాలతో సత్కరిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు..





