
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని గణేష్ నగర్ – సిర్సపల్లిల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ వల్ల ముందు తరాలకు శాపంగా మారుతుందని పలువురు వక్తలు అన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నాల్గవ రోజు దీక్ష జరిగింది. ఈ దీక్షలో ప్రజాసంఘాల నాయకులు బెల్లి రాజయ్య, ఎడ్ల విజయకుమార్, కొలిపాక సమ్మయ్య, కళ్లెపు హనుమంతరావు, వెంకటరెడ్డి, పాకాల రజనీకర్, యతీశ్వర్ రెడ్డి, పలకల ఈశ్వర్ రెడ్డి వేల్పుల రత్నం వేల్పుల ప్రభాకర్ సందెల వెంకన్న, గుడిపాటి జైపాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చందుపట్ల జనార్ధన్, గుడిపాటి సరిత, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండారెడ్డి, పోరెడ్డి దయాకర్ రెడ్డి, ఐలయ్య, ఉప్పు శ్రీనివాస్, కట్కూరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా ఎడవల్లి కొండారెడ్డి మాట్లాడుతూ… డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల విడుదల అయ్యే అనేక విషవాయువుల వల్ల ప్రజలకు క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుందని అన్నారు. నీటి కాలుష్యం వాయు కాలుష్యంతో ఈ ప్రాంతం అన్యాయమైపోతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు విరమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ద్వారా దీక్ష చేస్తున్న నాయకులకు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ తర్వాత తాను కూడా దీక్షలో పాల్గొంటానని తెలిపారు.

—కాంగ్రెస్, జాగృతిల సంఘీభావం
డంపింగ్ యార్డ్ ఏర్పాటను వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసన దీక్షలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ బాబు ,తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ లు సంఘీభావం ప్రకటించారు. ప్రజల కొరకు తాము కూడా డంపింగ్ యార్డ్ వ్యతిరేక కార్యక్రమాల్లో పాలు పంచు కుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు బుర్ర నటరాజ్, రాజ్ కుమార్, సుధాకర్, న్యాయవాది మాధవి, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్

మాట్లాడుతున్న సింగిల్ విండో అధ్యక్షుడు కొండల్ రెడ్డి..

మాట్లాడుతున్న కందుగుల ఉపసర్పంచ్ మండ సతీష్ గౌడ్

హుజురాబాద్ లోని సిరిసపళ్లిలో డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని నిరసన చేస్తున్న ప్రజా సంఘాలు.. హుజురాబాద్ డివిజన్ ప్రజలకు మద్దతు తెలిపిన తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా నాయకులు, తెలంగాణ జాగృతి హుజురాబాద్ డివిజన్ నాయకులు.





