
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా న్యాయవాది కేసరి శేషయ్య ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు జోజుల ప్రవీణ్ కుమార్, గురాల వెంకట్ కుమార్, బాగోతు కుమారస్వామిలు తెలిపారు. గురువారం ఎన్నికలు జరిగాయని సాధారణ కార్యదర్శిగా పాక జ్యోత్స్నా దేవి, ఉపాధ్యక్షుడుగా రాజేష్ పిట్టాల, జాయింట్ కార్యదర్శిగా యెంగాల లింగమూర్తి, క్రీడలు & సాంస్కృతిక కార్యదర్శిగా మోరే కళ్యాణ్
, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా యాస్మిన్ లు ఎన్నికైనట్లుగా వారు తెలిపారు. కాగా వారి ఎన్నిక పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

కేసరి శేషయ్య






