
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డంపింగ్ యార్డు ఏర్పాటు వల్ల కలిగే నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెల్లి టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని అఖిల పక్షం నేతలు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. హుజూరాబాద్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎస్సారెస్పీ కెనాల్ వద్ద శుక్రవారం మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మంత్రిని కలిసి విన్నవించిన వారిలో ఉన్నారు. కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీ పరిధిలోని చెత్తను హుజూరాబాద్ లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు కు తరలించడంతో విషపూరితమైన రసాయనాలు బయటకు వెలువడి ఈ ప్రాంతంలో వింత వ్యాధులు సోకి మనుషులు, జంతువులు, పశు పక్షాదుల ప్రాణాలు హరించుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. హుజూరాబాద్ ప్రాంతం నుండి ప్రతినిత్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లు గా గెలుపొంది మంత్రులు గా పదవుల్లో కొనసాగుతున్న బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్, బల్మూరి వెంకట్, పాడి కౌశిక్ రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితెల ప్రణవ్ బాబు తదితర నేతలు నిరసనను, ఈ సమస్య తీవ్రతను సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రద్దు చేపించాలని కోరారు. మంత్రినీ కలసిన వారిలో మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, అఖిల పక్షం నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, ప్రభాకర్, బండ శ్రీనివాస్, కటుకూరి మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, వర్ధినేని రవీందర్ రావు, కొండల్ రెడ్డి, జనార్ధన్, సమ్మయ్య, బాబు తదితరులు ఉన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేస్తున్న అఖిల పక్షం నాయకులు





