Oplus_16908288
—కరీంనగర్ సీపీపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా CP వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కూడా ఈ అంశంపై క్లారిఫికేషన్ కోరినట్లు పేర్కొంటూ, కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది తరఫున ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ వాహనాలను ప్రైవేట్ వ్యక్తులు వినియోగిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ సీపీ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ప్రభుత్వ ఆయుధాలు ఉపయోగించి ఫైరింగ్ నిర్వహించారని తెలిపారు. ఏకే-47తో 10 రౌండ్లు, ఎస్ఎల్ఆర్తో 10 రౌండ్లు, పిస్తాల్ తో 10 రౌండ్లు ఇతర ఆయుధాలతో కలిపి మొత్తం 108 రౌండ్లు ఫైరింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో బోనాలపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో బుల్లెట్లు పడినట్లు, బోనాలపల్లి గ్రామానికి చెందిన అమృతమ్మకు బుల్లెట్లు తగిలినట్లు ఆరోపించారు.
కరీంనగర్ జిల్లాలో 330 మంది హోమ్ గార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేసి, తిరిగి పోస్టింగుల కోసం లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. 108 మంది హోమ్ గార్డుల నుంచి సుమారు రూ.1.86 లక్షలు కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
బడేకాన్ పేరుతో ఒక్కో SHO నుంచి రూ.25,000 వసూళ్లు చేసినట్లు, స్పిన్నఫ్ బాటిళ్ల పేరుతో కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు.
పోలీస్ సిబ్బందికి సరెండర్ TAలు టిఏలు డిఏలు ఎరియర్స్ ఇవ్వడం లేదని, కానిస్టేబుళ్లు, Asi లు ఎస్ఐలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని ప్రతి పోలీస్ సిబ్బంది తరఫున ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల జరిగిన ఇల్లందకుంట రాములవారి కల్యాణానికి భారీగా ప్రజలు హాజరైనప్పటికీ సీపీ సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవడం నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శించారు.
తాను చేసిన ఆరోపణలపై సీఐడీ ద్వారా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలు తప్పైతే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కరీంనగర్ సీపీపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో సిపిపై ఆరోపణలు చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





